Reading Time: 2 minutes

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రం లో 109 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేశామని, రా ష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేసే యోచన చేస్తున్నామని వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగర్‌కర్నూ ల్ నియోజకవర్గంలోని ఎండబెట్లవద్ద 10 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శం కుస్థాపన, ఒక కోటి ఐదు లక్షల 50 వేల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గ దులను ప్రారంభించారు. అదేవిధంగా 9 కోట్లతూ నిర్మించనున్న నూతన కళాశాల భవనం,

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్లతో సిసి రోడ్లు పనులు, పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థకు 10 కో ట్లతో, 3 కోట్ల 14 లక్షలతో కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్ అధునాతన అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, వైద్య రం గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన బోధనపై దృష్టి సారించడంతో పాటు, వైద్యరంగంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందే లా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల విస్తరణ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవ లు అందించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ప్రజారోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాల నిర్మాణం చేశామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని వివరించారు. రాష్ట్రంలో 200 కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. న్యూట్రిషన్ ఆహారం, స్కిల్ ఎడ్యుకేషన్ విధానం కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని, చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు పలువురు విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖాముఖిగా మాట్లాడారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలే నడిపిస్తున్నారని అన్నారు.

ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. వంగూరు మండలంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాను విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే నాగర్‌కర్నూల్ పట్టణంలో విద్యాసంస్థలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మా ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం మీద ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు 7 కోట్ల 80 లక్షల 324 వడ్డీలేని రుణాల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు మంత్రి, ఎంపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ,కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.