Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో పరస్పర విరుద్ధమైన జాబితాల్లో చోటు చేసుకున్న వారి పేర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, బ్లాక్ ఆఫీసుల్లో వార్డు ఆఫీసుల్లో ప్రదర్శించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ విధమైన తేడాలున్నజాబితాల్లో 1.25 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఉన్నట్టు కోర్టు గుర్తించింది. 2002 ఓటర్ల జాబితాలతో పోల్చి చూస్తే ఓటర్లలో తేడాలు బయటపడ్డాయి. ఈ జాబితాల ప్రదర్శనకు కావలసిన సిబ్బందిని ఎన్నికల కమిషన్‌కు అందించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సూచించింది. డాక్యుమెంట్లు, అభ్యంతరాలు పంచాయతీ భవనాలు, బ్లాక్ ఆఫీసుల్లో భద్రపర్చాలని సూచించింది.