Reading Time: < 1 minute

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం(జనవరి 20) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్ రావుపై నమోదైన కేసును (చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై) హైకోర్టు కొట్టివేయగా, దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే జనవరి 5, 2026న సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ హరీష్ రావుకు ఊరటనిచ్చింది. సుప్రీం కోర్టులో వ్యక్తిగత కేసులో ఊరట లభించినప్పటికీ ప్రస్తుతం సాగుతున్న ప్రధాన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు