
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సౌత్, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె ప్రస్త్తుతం మైసా, కాక్‌టైల్ 2 చిత్రాలు చేస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ “ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నేనే అని చాలామంది అనుకుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ప్రత్యేక గీతాల్లో నటించడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అయితే ఆ సినిమాలో నేనే హీరోయిన్‌గా ఉండాలి. లేదంటే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులున్నారు. వాళ్లు అడిగితే కచ్చితంగా లీడ్ క్యారెక్టర్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేస్తాను” అని అన్నారు.