
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యువ సంచలనం గౌతమి నాయక్ (Gautami Naik) అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశారు. ఈవాళ గుజరాత్ జెయింట్స్ (GG)తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించారు.ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.గౌతమి( 55 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 73 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలోనే ఆర్సీబీ ౯ పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి
కష్టాల్లో ఉన్నప్పుడు గౌతమి క్రీజులోకి వచ్చింది. కెప్టెన్ స్మృతి మంధాన (26) తో కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. మంధాన అవుటయ్యాక మరింత వేగంగా ఆడుతూ రిచా ఘోష్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఆమె మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ఆర్సీబీ భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ఆష్టీన్ గార్డ్ నర్ 2, కాష్వీ గౌతమ్ 2, రేణుకా సింగ్, సోఫీ డివైన్ తలో వికెట్ పడగొట్టారు.