
మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. బుధవారం(జనవరి 21) ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11 లేదా 12 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏదో ఒకరోజు ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 26 లేదా 27న నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉంది. 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, 31న అభ్యంతరాల స్వీకరించి, ఫిబవరి 2 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవ్వనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3 నుంచి వారంపాటు ప్రచారానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల అగ్రనేతలు ఆయా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ గెలుపే లక్షంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.