Reading Time: < 1 minute

మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతూనే ఉంది. సోమవారంనాడు తాజాగా మరో 9 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్ జిల్లా పోలీసులు ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయిన వీరందరిపై రూ.45లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో ఒకరు డివిజినల్ కమిటీ సభ్యుడు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పాలసీకి ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారని పోలీసులు వెల్లడించారు.