
గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ మచ్చీ మార్కెట్ వద్ద గత కొద్ది రోజులుగా ప్రవహిస్తున్న మురుగు సమ స్యను పరిశీలించేందుకు వెళ్లిన గోషామహల్ బిఆర్‌ఎస్ నేత ఆనంద్‌కుమార్ గౌడ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రధాన అనుచరుడు, మంగళ్‌హాట్ కార్పోరే టర్ శశికళ భర్త ఎం కృష్ణ, బేగంబజార్ కార్పోరేటర్ జి శంకర్ యాదవ్ వారి అనుచరులు దాడి చేసి, గాయపర్చారని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. దాడి చేసి గాయపర్చిన రాజాసింగ్ పిఏ కృష్ణపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట బిఆర్‌ఎస్ నా యకులు, కార్యకర్తల ఆందోళన చేపట్టారు. మంగళ్‌హాట్ కార్పోరేటర్ శశికళ భర్త, రాజాసింగ్ పీఏగా వ్యవహరిస్తున్న కృష్ణ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు.
ప్రజల పక్షాన నిలబడి అనేక సమస్యలపై పోరాడుతున్న ఆనంద్‌కుమార్ గౌడ్‌పై దాడి చేసి, దౌర్జన్యాలకు దిగడం ఎంత వర కు సమంజసమని ప్రశ్నించారు. నియోజకవర్గం ప్రజలు ప్రజాప్రతినిధులు ఆగడాలన్నీ గమనిస్తున్నారని, ఆనంద్‌కుమార్ గౌడ్‌పై దాడి ఘటన కారణం గా రాబోయే జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిజెపి కార్పోరేటర్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ఆనంద్‌కుమార్ గౌడ్ షా హినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాజాసింగ్ పీఏ కృష్ణ, బేగంబజార్ కార్పోరేటర్ శంకర్‌యాదవ్‌లతో తనకు ప్రాణహాని ఉం దని , తనకు ఎలాంటి హాని జరిగినా, వారే బాధ్యత వహించాలని తన ఫిర్యాదుతో పేర్కొన్నారు.