
పంజాబ్ స్టేట్ డియర్ లాటరీ (లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ 2026)లో ఒక సాధారణ డ్రైవర్‌ను అదృష్టం వరించింది. కేవలం రూ. 500 పెట్టి కొన్న టికెట్‌తో ఆయన ఏకంగా రూ. 10 కోట్లు గెలుచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…35 ఏళ్లపృథ్వీ సింగ్ హర్యానా రాష్ట్రం, సిర్సా జిల్లా, రానియా ప్రాంతంలోని మొహమ్మద్‌పురియా గ్రామంలో నివసిస్తూసాధారణ డ్రైవర్ , రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు,తండ్రి, సోదరుడు ఉన్నారు. కాగా భార్య సుమన్ స్థానిక పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తోంది.
తండ్రి దేవీలాల్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.ఇటీవల పృథ్వీ సింగ్ కిలియాన్‌వాలి మండిలోని మదన్ లాల్ అనే ఏజెంట్ దగ్గర మూడు టికెట్లు (రూ. 500, రూ. 200, రూ. 100) కొనుగోలు చేశారు. ఇందులో రూ. 500 టికెట్‌కు (నెంబర్: 327706) మొదటి బహుమతిగా రూ. 10 కోట్లు వచ్చాయి.30% పన్ను మినహాయింపు పోను ఆయనకు సుమారు రూ. 7 కోట్లు చేతికి అందనున్నాయి.ఈ వార్త తెలియగానే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పృథ్వీ సింగ్ ను గ్రామస్తులు నోట్ల దండలతో సత్కరించారు. తన పిల్లల భవిష్యత్తు కోసం మరియు సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఈ డబ్బును ఉపయోగిస్తానని పృథ్వీ సింగ్ తెలిపారు.