Reading Time: < 1 minute

ఏడుగురు ప్రయాణీకులకు తీవ్రగాయాలు

మరికొంతమందికి స్వల్పగాయాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపంలో సోమవారం ఒక పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. రాజాం నుండి విజయనగరం వెళ్తున్న ఈ బస్సు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా డ్రైవర్ అప్పల గురువులు కు ఒక్కసారిగా ఫిట్స్ (మూర్ఛ) వచ్చింది. దీనితో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వేగంగా దూసుకెళ్లి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో కలిపి మొత్తం 87 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్పల గురువులును హాస్పిట ల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. సమాచారం అందుకు న్న చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, గరివిడి ఎస్త్స్ర లోకేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయ పడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.