Reading Time: < 1 minute

 జర్మనీలో ట్రాన్స్ మిషన్ లైన్ టెక్నీషియన్‌ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వాటికి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సూచించింది. ఐటిఐ, డిప్లొమ, బిటెక్ అర్హత కలిగి ఉండి, ట్రాన్స్‌మిషన్ లైన్ టెక్నీషియన్‌గా కనీసం 2 నుండి -3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి కలిగి ఉండాలని తెలిపింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద ఒక రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఇది తెలంగాణా నుండి అర్హత కలిగిన, నైపుణ్యం కలిగిన, సెమీస్కిల్ కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేయడానికి

ఒక నిర్దిష్ట ఆదేశంతో పనిచేస్తోంది. పైన పేర్కొన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థుల వయస్సు 21నుండి -35 సంవత్సరాల మధ్య ఉండాలని, ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలని తెలిపింది. టామ్ కామ్ ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com కు పంపమని ఆహ్వానించింది. మరిన్ని వివరాలకు www.tomcom.telangana.gov.in ని సందర్శించాలని, లేదా టామ్‌కామ్ ఫోన్ 94400 49013, 94400 50951, 94400 51452 నంబర్‌లను సంప్రదించవచ్చని టామ్‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు.