
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్-2026లో మరో ఆసక్తికర మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వడోదర బిసిఎ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. ఆర్‌సిబి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ మూడోస్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. గుజరాత్ మాత్రం రెండు మార్పులు చేసింది. గాయం తర్వాత అనుష్క శర్మ తిరిగి జట్టులోకి రాగా.. హ్యాపీ కుమారి ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేస్తోంది.
తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధన(కెప్టెన్), జార్జియా వోల్, రిచా ఘోష్(కీపర్), గౌతమి నాయక్, నదీన్ డి క్లర్క్, రాధా యాదవ్, ప్రేమ రావత్, శ్రేయాంక పాటిల్, సయాలీ సత్‌ఘరే, లారెన్ బెల్.
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ(కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, కనికా అహుజా, యాష్లీ గార్డ్నర్(కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, కష్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, తనుజా కన్వర్, హ్యాపీ కుమారి, రేణుకా సింగ్ ఠాకూర్.