Reading Time: < 1 minute

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో, టివికె అధినేత విజయ్‌ను సిబిఐ రెండోసారి విచారించింది. సోమవారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్‌ను అధికారులు దాదాపు 6 గంటలపాటు విజయ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నెల 12నే ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్‌ను సిబిఐ ఆరు గంటలకుపైగా ప్రశ్నించింది. మరుసటి రోజు కూడా హాజరీకి ఆదేశించారు. అయితే పొంగళ్ పండుగ కారణంగా తనకు గడువు ఇవ్వాలని ఆయన కోరాడు. ఈరోజు రెండోసారి విచారణ సందర్భంగా విజయ్ ను అనుమానుతుడిగా ప్రశ్నించిట్లు తెలుస్తోంది. తొలిసారి ఆయనను సిబిఐ సాక్షిగా ప్రశ్నించినట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, విచారణ పూర్తి కావడంతో వచ్చే నెల ఫిబ్రవరి రెండో వారంలో విజయ్‌ పై సిబిఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.