Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్ లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రాజధాని కాబూల్ డౌన్‌టౌన్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ పేలుడులో పలువురు మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. రద్దీగా ఉండే షహర్-ఎ-నవ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించిందని… దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. పేలుడుకు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.