
అమరావతి: గుడిసెల్లో ఉన్నవారికి పక్కా ఇళ్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. మహిళలకు సమాన హక్కు కల్పించిన వ్యక్తి అని అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి పర్యటించారు. కొప్పరం, పత్తేపురంలో ఎన్టిఆర్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాల కల్పనకు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని తెలియజేశారు. అద్దంకిలో సోలార్ ప్యానల్ తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.