Reading Time: < 1 minute

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుతో.. టిడిపి పతనానికి బీజం వేసింది సిఎం రేవంత్ రెడ్డి నే అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్  తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్, అడిషినల్ డిజిపి మహేష్ భగవత్ కు రేవంత్ పై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ ను 100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలని అప్రజాస్వామికంగా మాట్లాడారని, బిఆర్ఎస్ దిమ్మెలను టిడిపి నాయకులు కూలగొట్టాలని పిలుపునిచ్చారని మండిపడ్డారు. బిజెపి-టిడిపితో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని రేవంత్ దెబ్బతీస్తున్నారని, రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్ నేతల డిమాండ్ చేశారని దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.