
శ్రీనగర్: మహిళ కాళ్లు చేతులను తాడుతో కట్టి అనంతరం ఆమెను ప్లాస్టిక్ బ్యాగ్‌లో కట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ సంఘటన జమ్ము కశ్మీర్ రాష్ట్రం రాజౌరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంజకోట్ ప్రాంతం కకోరా గ్రామానికి చెందిన సబరా హుస్సేన్, అజీమ్ అఖ్తర్ అనే దంపతులు రాజౌరి టౌన్‌లోని వార్డు నెంబర్‌లో 9 నివసిస్తున్నారు. తాండవలా ప్రాంతంలో అనుమానాస్పదంగా ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్లాస్టిక్ బ్యాగ్ ఓపెన్ చేయగా అందులోని తాళ్లతో బంధించిన మహిళ కనిపించింది. సదరు మహిళ అజీమ్ అఖ్తర్‌గా గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.