
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి హిట్ పడి చాలా కాలమే అయింది. 2024లో ‘మట్కా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్. కానీ, ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ ఓ డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. వరుణ్ హారర్ చిత్రం చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర గ్లింప్స్, టైటిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుడంగా.. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడియన్ సత్యం కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. కొరియన్ పోలీసులు సత్యను కట్టేసి కొడుతుంటే.. వరుణ్ తేజ్ కటానాతో వచ్చి పోలీసులను చంపేస్తాడు. కట్ చేసి చూస్తే అతడిని ఓ దెయ్యం ఆవహించి ఉంటుంది. గ్లింప్స్ చూసిన అభిమానులు ఈసారి వరుణ్‌కి హిట్ పక్కా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నాట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.