Reading Time: < 1 minute

అమరావతి: డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గరివిడి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అప్పల గురువులు పల్లె వెలుగు బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బస్సు రాజాం నుంచి విజయనగరం వెళ్తుండగా అప్పన్నవలస వద్ద రాగానే డ్రైవర్‌కు పిట్స్ రావడంతో వాహనం పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు 87 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.