
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటించనుందని తెలుస్తోంది. టబు పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రమే వస్తోందని.. ఆమె పాత్ర కథలో చాలా కీలకం అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక టబు ఇప్పటికే పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. ఈ సినిమాలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రం మార్చి 27న గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది.