Reading Time: < 1 minute

అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ’నాగబంధం’, విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. అయితే చిత్ర బృందం హీరోయిన్ నభా నటేష్‌ను పార్వతి పాత్రలో పరిచయం చేస్తూ ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో, నభా నటేష్ అద్భుతమైన, సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తోంది. హుందాతనం, పవిత్రత, ఆధ్యాత్మికత వెదజల్లుతోంది. ఆమె ముఖంలో కనిపించే ఆత్మీయమైన భావం, భక్తి, పురాణాల మూలాల నుంచి పుట్టిన పాత్రను సూచిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ మరో కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగబంధం భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగుతుంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న నాగబంధం ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.