Reading Time: < 1 minute

చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనపై హీరో, టివికె అధినేత విజయ్ సోమవారం ఢిల్లీలో సిబిఐ విచారణకు హాజరవుతారు. ఇందుకోసం ఆయన ఆదివారం సాయంత్రం ఛార్డర్డ్ విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 12నే ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్‌ను సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఆరు గంటలకుపైగా ప్రశ్నించారు. మరుసటి రోజు కూడా హాజరీకి ఆదేశించారు. అయితే పొంగళ్ పండుగ కారణంగా తనకు గడువు ఇవ్వాలని ఆయన కోరాడు. ఇప్పుడు రెండో దఫా విచారణకు సోమవారం విజయ్ హాజరీకి రంగం సిద్ధం అయింది.