
మాడ్రిడ్: స్పెయిన్ దేశం అండాలుసియిన్ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలు ఢీకొట్టడంతో 21 మంది దుర్మరణం చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. రైలు మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తుండగా అడముజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది కాలరాత్రి దినమని ప్రధాని బాధను వ్యక్తం చేశారు. రెండు రైళ్లలో కలిపి 400 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది.