
నా గౌరవానికి భంగం కలిగితే రాజీపడబోను
మీ పంచాయితీలోకి మా మంత్రులను, ప్రజాప్రతినిధులను లాగొద్దు
ఏదైనా ఉంటే నా వివరణ తీసుకోండి.. 24 గంటలు మీడియాకు అందుబాటులో ఉంటా
బొగ్గు టెండర్లలో అవినీతి జరగలేదు
అనుభవం ఉన్న కంపెనీకే నిబంధనల ప్రకారం అప్పజెప్పుతాం
అనుభవం లేకున్నా.. సీనియర్లతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నా
ఖమ్మం వేదికగా సిఎం రేవంత్ వ్యాఖ్యలు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో అ ణాపైసా అవకతవకలకు అస్కారం లే దని, ఉద్దేశపూర్వకంగా మంత్రుల జో లికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గుగను ల టెండర్లు, మంత్రులపై ఆదివారం వచ్చిన వార్తా కథనాల నేపథ్యంలో ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ తీవ్రం గా స్పందించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం మద్దులపల్లి సభలో ప్రసంగిస్తూ సింగరేణి లో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని ఓ పత్రిక, చానెల్లో ఆ దివారం కథనం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు.
ఇలాంటి వ్యవహారాల్లోకి తమ మంత్రులను లాగి బద్నాం చేయొద్దని సీఎం సూచించారు. బొగ్గు టెండర్ల విషయంలోకాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు చోటివ్వదని, మరోసారి తమ మంత్రులు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘అనవసరమైన తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కలిగిస్తూ మళ్లీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సహకారం జేస్తుండ్రు.
ఇద్దరు మీడియా యజమానులకు పంచాయితీలుంటే తలుపులు మూసుకుని కొట్టుకోండి. ఆంబోతులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్లు ఇరిగిన విధంగా, ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుని మంత్రులను బద్నాం జేసే కార్యక్రమాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు. దయచేసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచునికి, సుబాహునికి, శుక్రాచార్యునికి సహకారం అందించినట్లుగా ఉంటది. ఒక్కసారి ఆలోచన చేసి, వాస్తవాలను తెలుసుకుని, రాసేముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకు 24 గంటలు, సంవత్సారానికి 365 రోజులు ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ, మీడియాకు వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ పేపర్‌లో వచ్చినా, టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిపై ఆరోపణ వచ్చినా, వాళ్లందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది. నా నాయకత్వంపట్ల అపోహలను కలిగిస్తుంది.
ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రులమీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి’అని సీఎం రేవంత్ రెడ్డి సభావేదిక ద్వారా మీడియాను కోరారు. ప్రజా పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వాన్ని కుట్రలు, కుతంత్రాలతో పడగొట్టాలని ఫాంహౌజ్ లోని శుక్రాచార్యుడు ప్రయత్నిస్తున్నాడని , ఇందులో భాగంగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా ద్వారా అడ్డగోలు ప్రచారం చేయిస్తూ మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారని అన్నారు. సింగరేణి బొగ్గుగనులకు సంబంధించి తమ ప్రభుత్వంలో అక్రమాలు, అవకతవకలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కోల్ మైన్ టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా, నిజమైన, నిఖార్సయిన, అనుభవం ఉన్నవాళ్లకే ఇస్తుందే తప్ప, అణా పైసా అవినీతికి అవకాశం ఇవ్వబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
రెండేళ్ల మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వలేదు. సింగరేణి కాంట్రాక్టుల విషయంలో కూడా చట్టపరంగానే టెండర్ కట్టబెడతామన్నారు. తనకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేకున్నా.. సీనియర్ల సలహాలతో, అందరి సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు ఈ సందర్బంగా ఆయన పేర్కోన్నారు. ఎంతో అనుభవమున్న తుమ్మల అనుభవాన్ని తీసుకుంటున్నామని, సమ్మక సారక్క జాతర వద్ద కేవలం వంద రోజుల్లో అమ్మ మందిరాలను నిర్మించే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగించానని, ఆయన 24గంటలపాటు అక్కడే ఉండి పూర్తి చేయించారని, ఢిల్లీలో ఏమి అవసరం ఉన్నా, అనుమతులు కావాలన్నా డిప్యూటి సిఎం మల్లు భట్టి కాలికి బలపం కట్టుకొని ఢిల్లీలో గల్లిగల్లిలో తిరుగుతూ రాష్ట్రానికి నిధులు, అనుమతులు తీసుకోస్తున్నాడని అన్నారు.
బిఆర్‌ఎస్ పాలనలో అన్ని పాత్రలు ఒక్కరే పోషించారని.. దుర్యోధనుడైనా, దుశ్శాసనుడైనా ఏకపాత్రాభినయం చేశారని ఎద్దేవా చేశారు. తన పాలనలో అందరినీ సమన్వయం చేసుకుంటూ.. అందరి అనుభవాలను పంచుకుంటూ.. సమన్వయంతో ముందకు వెళ్తున్నామన్నారు. నాకు అదృష్టం కలిసి వచ్చిందని మంత్రిగా పనిచేసిన అనుభవం లేకున్నా ఎమ్మెల్సీనుంచి ఏకంగా సిఎం అయ్యే అవకాశం దక్కిందని.. ఇదంతా కష్టాని నమ్ముకోవడం, క్రమ శిక్షణతో పని చేయడంవల్లనే సిఎం అయ్యానని అన్నారు. తనకంటే అనుభవం కలిగినవారు ఉన్నప్పటికీ తనకు అవకాశం కల్పించారని, మంత్రిగా అనుభవం లేకున్నా అందరి సంపూర్ణ సహకారంతో గడిచిన రెండేళ్ళ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశానని రేవంత్ రెడ్డి అన్నారు.