Reading Time: < 1 minute

భోపాల్: తుపాకీ కాల్పుల నుంచి ఓ యువకుడిని ఫోన్ కాపాడిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోల్‌గవా పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యాసాగర్ రావు అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బైక్‌పై వచ్చి ఎదురుగా ఆటోను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న నలుగురు యువకుడు ఆటో డ్రైవర్‌తో గొడవకు దిగారు. ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్ విద్యాసాగర్ కాలుకు తగలడంతో పాటు మరో బుల్లెట్ ఛాతీ వైపు దూసుకొచ్చింది. జేబులో స్మార్ట్ ఫోన్ ఉండడంతో దానికి తగిలి బుల్లెట్ ఆగిపోయింది. ఫోన్ లేకుంటే గుండెలోకి బుల్లెట్ దిగేది. ఫోనే ఆటో డ్రైవర్ ప్రాణాలు కాపాడింది. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.