Reading Time: 2 minutes

 గ్రీన్‌లాండ్ టారిఫ్ విధించడంపై యూరోపియన్ యూనియన్ దేశాల ఆగ్రహం

అమెరికా యంత్రాంగంతోనే తేల్చుకుంటాం: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

ట్రంప్ తాటాకు చప్పుళ్లకు భయపడం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్

బ్లాక్‌మెయిల్ తగదు: స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్

అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలి: యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్

లండన్: ట్రంప్ విధించిన గ్రీన్‌లాండ్ టారీఫ్‌పై అమెరికా మిత్రపక్ష యూరోపియన్ యూనియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయంతో చైనా, రష్యాలు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాయని తెలిపారు. మిత్రదేశాలపై భారం విధించడం ద్వారా శత్రువుకు లాభాలు కల్గిస్తారా? అని ఐరోపా నేతలు ప్రశ్నించారు. ట్రంప్ గ్రీన్‌లాండ్ వాదనకు మద్దతు తెలుపని దేశాలపై పది శాతం సుంకాలు విధించారు. దీనిని పాతిక శాతంగా చేస్తానని కూడా ట్రంప్ బెదిరించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇతర కీలక దేశాలు కూడా ట్రంప్ టారీఫ్ జాబితాలో ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించుకునేందు కు ఆదివార యూరోపియన్ మిత్రపక్ష దేశాల నేతలు సమావేశం అయ్యారు.

ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ట్రంప్ తమపై గ్రీన్‌లాండ్ స్వాధీన టారీఫ్ విధించడం తప్పుడు చర్య అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ విమర్శించారు. గ్రీన్‌లాండ్‌పై తమ వైఖరి సుస్పష్టం అని , పైగా గ్రీన్‌లాండ్ భవితవ్యం అనేది గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌కు సంబంధించినది. ఇందులో తమ దేశాలను లాగడం , భారం వేయడం అనాలోచిత చర్య అవుతుందని స్టార్మర్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 1 నుంచి ట్రంప్ పది శాతం టారీఫ్ బ్రిటన్, డెన్మార్క్, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్‌లపై అమలులోకి వస్తుంది. దీని పర్యవసానాలను విశ్లేషించుకునేందుకు , ప్రతిఘటించేందుకు మిత్రపక్ష దేశాల అగ్రనేతలు లంవన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ కేంద్రంగా సమావేశం కావ డం కీలక పరిణామం అయింది. డెన్మార్క్ పరిధిలోకి వచ్చే గ్రీన్‌లాండ్ వ్యవహారం రెండింటి విషయం, దీనితో తమకు సంబంధం ఏముంటుందని స్టార్మర్ తమ ప్రకటనలో ప్రశ్నించారు.

నాటో దేశాల సరుకులపై టారీఫ్‌లకు దిగడం , ఏకం గా ఈ కూటమి భద్రత సంబంధిత విషయాలపై ప్రభావం చూపుతుంది. పరిస్థితిని విశ్లేషించుకుంటున్నామని, నేరుగా అమెరికా అధికార యంత్రాంగంతో చర్చిస్తామని ప్రకటన వె లువరించారు. బెదిరింపులకు భయపడేది లేదని ఫ్రాన్స్ నేత ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ స్పష్టం చేశారు. బ్లాక్‌మొయిల్ పద్ధ తి చెల్లనేరదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ తెలిపారు. తాము ఉరుకునేది లేదని ఇయే దేశాలన్ని కలిసి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందిస్తామని చెప్పారు. ఇక యూరోపియ న్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ కూడా స్పందించారు. ఇటువంటి చర్యలకు దిగేముందు అంతర్జాతీయ చట్టాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని స్ప ష్టం చేశారు. ఇక వచ్చే వారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య కీలక సమావేశం జరుగుతుంది. దీనికి ట్రంప్ ఇతర నేతలు హాజరు అవుతారు. ఈ దశలో గ్రీన్‌లాండ్ విష యం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. ఆర్థిక ప్రభావం చూ పే విషయం కావడంతో ట్రంప్ తాజా టారీఫ్‌ల అంశం ఈ వేదికపై తీవ్రస్థాయి చర్చకు దారితీస్తుందని భావిస్తున్నారు.