
ట్రంప్ ఆక్రమణవాదంపై ధ్వజమెత్తిన గ్రీన్‌లాండ్ వాసులు
గడ్డకట్టించే మంచులో వేలాదిమంది నిరసన ప్రదర్శన
న్యూక్: ట్రంప్ ఆక్రమణవాదానికి నిరసనగా వేలాది మంది గ్రీన్‌ండ్ ప్రజలు ఆదివారం వినూత్న రీతిలో నిరసనకు దిగారు. చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని వారు మం చు చరియల మీదుగా అత్యంత జాగ్రత్తగా ముందుకు క దిలారు. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు. ఇతరులు ఎవరూ దీనిని తమది అనుకోరాదని అమెరికాకు హెచ్చరికతో ని నాదాలకు దిగారు. అమెరికా అధ్యక్షుడి దుందుడుకు వైఖరి కి నిరసనగా ఉద్యమించాలనే తమ సంకల్పాన్ని జనం ఈ ఐస్‌వాక్ ద్వారా ప్రకటించారు. అమెరికా స్వాధీనం బెది రింపుల క్రమంలో గ్రీన్‌లాండ్‌వాలాలు తమ స్వయం పాల నాధికార హక్కును చాటుకుంటూ ప్రదర్శనకు దిగడంతో రాజధాని న్యూక్ నగరంలో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.
గడ్డకట్టుకుని పోయే చలి వాతావరణంలో జనం డౌన్‌టౌన్ నుంచి స్థానిక అమెరికా కాన్సులేట్ వరకూ నడక సాగించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా గ్రీన్‌లాండ్ సొంత పా లన వాదం తిరుగులేకుండా సాగుతుందని సంకల్పబలాన్ని చాటారు. ఓ వైపు భారీ వర్షం పడుతూ ఉన్నా లెక్కచేయ కుండా నిరసన సాగింది. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకుం టామనే ట్రంప్ మాటలు,దీనిని వ్యతిరేకించే దేశాలపై పది శాతం సుంకాల విధింపు ప్రకటన కూడా ఇదే సమయంలో వెలువడటంతో పౌరులు భగ్గుమన్నారు. రాజధానికి చెందిన వారిలో సగానికి పైగా ఇప్పుడు నిరసన ప్రదర్శనలో పా ల్గొన్నారని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడ్‌రిక్ నీల్సన్ తెలిపా రు. ఇది ఈ దీవిలో అతి పెద్ద నిరసన అన్నారు. పలువురు ప్రజలు ఇదే స్పందన వ్యక్తం చేశారు. డెన్మార్క్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా గ్రీన్‌లాండ్‌కు సంఘీభవంగా జనం ప్రదర్శనలు నిర్వహించారు.