
న్యూఢిల్లీ: గాజాలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి మండలిలో చేరాలని అమెరికా భారతదేశానికి ఆహ్వానం అందించింది. గాజా ప్రాంతంలో యుద్ధానికి స్వస్తి పలికే లక్ష్యంతో వివిధ దేశాలతో ఈ శాంతి మండలి ఏ ర్పాటు చేస్తున్నారు. కాల్పుల విరమణ కార్యక్రమంలో భాగం గా గాజాలో రోజువారీ వ్యవహారాలను నిర్వహించే సాంకేతిక కమిటీని ఈ శాంతి మండలి పర్యవేక్షిస్తుంది. బౌగోళిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రపంచ శాంతి కార్యక్రమంలో భారతదేశం పాత్ర, ప్రాముఖ్యతను అమెరికా ఆహ్వానం తేటతె ల్లం చేస్తున్నది.
భారతదేశంతో పాటు, జోర్డాన్, పాకిస్తాన్, గ్రీస్, సైప్రెస్ దేశాలనూ ట్రంప్ శాంతి మండలిలో చేరాలని ఆహ్వానించారు. ఇంతకు ముందే కెనడా, టర్కీ, ఈజిప్ట్ , పరాగ్వే, ఆర్జెంటీనా, అల్బేనియా దేశాలను కూడా ఆహ్వానించినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో ముఖ్య దేశాల నాయకులు ఈ శాంతి మండలిలో ఉంటారని భావిస్తున్నా. ఎన్నిదేశాలను ఆహ్వానించారని తెలియదు. బహుశా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక లో శాంతి మండలి సభ్యుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.