Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ తల్లి గోడు ఆలకించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కోరారు. మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాష్టీకాలపై దృష్టి సారించాలని రాహుల్‌గాంధీకి సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచిందని, రోహిత్ వేముల చట్టం తీసుకురావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందని అడిగారు. దళితులపై ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపాలని, వెంటనే రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కర్ల రాజేశ్ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయండి.. రాజేశ్ లాకప్ డెత్‌కు కారణమైన ఎస్‌ఐ వెంటనే చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తగిన సూచనలు ఇవ్వాలని రాహుల్‌గాంధీని కోరారు.