
ఇండోర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీం ఇండియా లక్ష్య చేధనలో తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన కివీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. అయితే ఈ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీం ఇండియా రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 11 పరుగుల స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ జేమిసన్ బౌలింగ్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(23) ఔట్ అయ్యాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్(3), కెఎల్ రాహుల్(1) నిరాశ పరిచారు. ఈ దశలో క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో కలిసి నితీశ్ కుమార్ రెడ్డి స్కోర్‌ని పెంచే ప్రయత్నం చేశాడు. కోహ్లీ, నితీశ్‌ల జోడీ 88 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించారు. అయితే 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నితీశ్ క్లార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(69), జడేజా(7) ఉన్నారు. మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత్‌కు ఇంకా 169 పరుగులు అవసరం ఉంది.