Reading Time: < 1 minute
Ind Win Toss And Decided To Bat Against New Zealand

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదవ T20I మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలింగ్ చేయనుంది. కాగా భారత్ మొదటి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, టీం ఇండియా నాలుగో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read:Samsung Galaxy F70: సామ్ సంగ్ అద్భుతమైన 5G ఫోన్ గెలాక్సీ F70 లాంచ్ కు రెడీ.. ధర రూ. 10,000 నుండి ప్రారంభం!

ఐదవ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని టీం ఇండియా చూస్తోంది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్ ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు, ఎందుకంటే అతను మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందాలని చూస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం టీం ఇండియా తన ప్లేయింగ్ ఎలెవన్ లో మూడు మార్పులు చేసింది. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు.

భారత్ (ప్లేయింగ్ XI): భారత్- అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.