
ముంబై: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న టి20 సిరీస్‌లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కివీస్ సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలతో భారత జట్టు చాటిందన్నాడు. రానున్న టి20 వరల్డ్‌కప్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదన్నాడు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ప్రదర్శన చాలా అద్భుతమన్నాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ సిరీస్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోతుండడం తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల బ్యాటింగ్‌ను కూడా గవాస్కర్ కొనియాడాడు. ఈ ముగ్గురి వల్లే టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిందని ప్రశంసించాడు.