Reading Time: < 1 minute

కూకట్ పల్లి  వివేకానంద నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై చైనా మాంజా (నైలాన్ దారం) మెడకు చుట్టుకోవడంతో ఐదేళ్ల చిన్నారి నిషిక దరియా దుర్మరణం చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రహదారిపై తేలియాడుతున్న చైనా మాంజా చిన్నారి మెడకు చిక్కుకుని తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా వినియోగం ప్రాణాంతకంగా మారుతోందని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.