Reading Time: < 1 minute

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రధాన రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు బిఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు దీనిపై సిట్ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్‌కు కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.