Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఈ మెగా టోర్నీని బాయ్ కాట్  చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టోర్నీలో ఆడటానికి అనుమతి ఇచ్చినా.. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. టోర్నీ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలోంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది 

అయితే, బంగ్లాదేశ్ బాటలోనే మొదట మొత్తం టోర్నమెంట్ నుండి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లు పాకిస్తాన్ స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను మాత్రమే పాక్ బహిష్కరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై PCB చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించలేదు. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనాలా? వద్దా? అనేది ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. ప్రధాన మంత్రి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ తెలిపాడు. దీంతో టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది.

ఇదిలావుంటే.. బంగ్లాదేశ్ వివాదం తర్వాత పాకిస్తాన్ ఐసిసి ఆదాయ వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది. ఒకవేళ ఇండియాతో మ్యాచ్ ని బహిష్కరిస్తే.. ఐసిసికి భారీగా నష్టం జరుగుతుంది. అయితే, 2026 టి20 ప్రపంచ కప్ లో ఏదైనా మ్యాచ్ ని బహిష్కరించడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ఐసిసి భారీ శిక్ష విధించే అవకాశం ఉంది.

కాగా, పాకిస్తాన్ ఇప్పటికే టోర్నమెంట్ కోసం తమ జట్టును ప్రకటించింది. కీలక ప్లేయర్లు ఏస్ పేసర్ హరిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ లను జట్టు నుంచి తొలగించారు.

పాకిస్థాన్ జట్టు:

సల్మాన్ అలీ అఘా (c), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (wk), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (wk), సయీమ్ అయూబ్, షహద్ ఖాన్, U షహద్ ఖాన్, U షాద్ ఖాన్ తారిఖ్.