Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని టిజెఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్ కు తమ అభిప్రాయం తెలిపామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలియజేశారు. ట్యాపింగ్ చేపినప్పుడు లేని భయం.. విచారణకు ఎందుకు? అని ప్రశ్నించారు. సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ చేయొద్దు అని కోదండరాం కోరారు.