Reading Time: < 1 minute

బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గురుకులంలో ఆటోలో నుంచి విద్యార్థిని కింద పడి మృతి చెందింది. ఆదివారం సాయంత్రం వేళలో గురుకుల ఆవరణలో ఆటోలో నుంచి బెంచీలను కిందకు దించుతుండగా, ఆటో ఒక్కసారి ముందు కదలడంతో విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అయిందని, బాలికలు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్నూర్ మండలం కోడి చీర గ్రామానికి చెందిన సంగీత (14) కు తీవ్ర రక్తస్రామై అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అన్నారు. కాగా బయట నుంచి వచ్చిన ఆటోలో నుంచి బెంచీలు కుర్చీలను విద్యార్థులు ఎందుకు దించారు, తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబీకులు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయని, తల్లిదండ్రులు ఆరోపించారు. ఆసుపత్రికి చేరుకొని కంటతడి పెట్టుకున్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, సిఐ శ్రీధర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.