Reading Time: < 1 minute

అమరావతి: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని హోమ్ స్టేకు తీసుకెళ్లి ఆమెపై యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేలుకు చెందిన వీర యశ్వంత్(21) చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన యువతి(19) పరిచయమైంది. ఇన్‌స్టాలో ప్రతి రోజు ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చిన యశ్వంత్ యువతి కలుద్దామని కోరాడు. యువతి ఓకే చెప్పడంతో రామచంద్రనగర్‌లోని హోమ్ స్టేకు యువతిని యువకుడు తీసుకెళ్లి ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. యువతి ముబావంగా ఉండడంతో ఆమెను తల్లి ఆరా తీసింది. జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.