Reading Time: < 1 minute

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అత్యంత విశిష్ట అశోక్ చక్ర పురస్కారాన్ని వ్యోమగామి శుభాంశు శుక్లాకు గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు తమ అత్యంత అసాధారణ అంతరిక్ష ప్రయాణంతో విశ్వ ఖ్యాతి గాంచారు. ఆయనతో దేశ యువత మరింత స్ఫూర్తి పొందుతుందని , ఓ వైపు వాయుసేనలో కీలక పాత్రతో పాటు అంతరిక్ష రంగంలోనూ విజయంతో ఆయన సాధించిన ద్వంద్వ విజయాలకు గుర్తింపుగా పురస్కారం ప్రకటించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా నిలిచారు. యాక్సియామ్ 4 స్పేస్‌మిషన్‌లో భాగంగా ఆయన ఇతర వ్యోమగాములతో కలిసి అత్యంత క్లిష్టమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ప్రవేశించారు. పైగా ఐఎస్‌ఎస్‌లోనికి ప్రవేశించిన తొలి భారతీయుడిగా చరిత్ర రాశారు.