
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పది మంది డిఎస్పిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డిజిపి బి. శివధర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్,డిడి ఏసిపిగా విధులు నిర్వహిస్తున్న ఎల్.ఆదినారాయణ కొత్తగూడెం ఎస్‌డిపిఓగా, సిటిసి ఏసిపిగా ఉన్న డి.వి. ప్రదీప్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ సిటీ పరిధిలోని ఆదిబట్ల ఏసిపిగా, సిఐడి డిఎస్పి ఎం. ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసిపిగా, మల్కాజ్‌గిరి ఏసిపి ఎస్. చక్రపాణిని మల్కాజ్‌గిరి జవహర్ నగర్ ఏసిపిగా, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి బి. మోహన్ కుమార్ ను మల్కాజ్‌గిరి పరిధిలోని మేడిపల్లి ఏసిపిగా, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ ఏసిపిగా ఉన్న బి. రవీందర్‌ను భువగిరి ఎస్‌డిపిఓగా, యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పిగా ఉన్న సిహెచ్. శ్రీధర్ ను హైదరాబాద్ సిటీలోని మహాంకాళి ఏసిపిగా బదిలీ చేశారు. కొత్తగూడెం ఎస్‌డిపిఓగా ఉన్న ఎస్.కె. అబ్దుల్ రహమాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డిపిఓగా ఉన్న ఎన్. చంద్ర బాను ను నేరుగా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో డిజిపి పేర్కొన్నారు.