Reading Time: < 1 minute

చెన్నై: తమిళనాడులో హిందీకి ఎప్పటికీ చోటు లేదని డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన భాషా అమరవీరుల త్యాగాలను ఆయన కొనియాడారు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇకపై కానీ హిందీ ఇక్కడికి చేరలేదని స్టాలిన్ తెలిపారు. భాషా అమరుల దినం సందర్భంగా ఆదివారం స్టాలిన్ సందేశం వెలువడింది.

తమిళ నేలలో సొంత భాషను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తారు. హిందీకి వ్యతిరేకంగా సంఘటితంగా తమిళులు పోరాడారని , ప్రతిసారి ఈ ప్రతిఘటన సాగింది. దీనితోనే హిందీ ఈ రాష్ట్రం పొలిమేర దాటలేదని తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ రాష్ట్రంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమ ఘట్టాలను తెలిపే సంక్షిప్త వీడియోను పొందుపర్చారు. భాషా పరిరక్షణకు ద్రవిడ దిగ్గజ నేతలు సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి వారు అందించిన సేవలను ఈ వీడియోలో చేర్చారు. ఉద్యమ ఘట్టాలను వివరించారు.