
అల్వాల్లో ఓ వసతి గృహంలో ఆదివారం తెలవారు జామున చేలరేగిన మంటలతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అల్వాల్ హై టెన్షన్ లైన్‌లో బాలికల వసతి గృహంలోని 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై ఉరుకులు పరు గులు తీశారు. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వ స్థతకు గురి కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 200 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం సకాలంలో అగ్నిమాపక అధికారులు స్పందించడంతో పె ను ప్రమాదం తప్పింది. పోలీసు ఉన్నతాధికారులు చేరుకొని ఘటన తీవ్రతను పరిశీలించి చికిత్స పొందుతున్న విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించారు.