
గువాహటి: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బర్సాపర స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి స్థానంలో బుమ్రా, బిష్ణాయ్ జట్టులోకి వచ్చారు. ఇక న్యూజిలాండ్ రెండో టి-20లో విఫలమైన ఫౌల్క్స్‌ని తప్పించి అతడి స్థానంలో జెమిసన్‌ని జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు:
భారత్: సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్టాయ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జెమిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ