
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చాలా ఫిట్‌గా ఉంటారు. తరచూ జిమ్, వ్యాయామం, డైట్ కంట్రోల్ చేస్తూ.. ఆరోగ్యవంతంగా కనిపిస్తుంటారు. చాలా మంది హృతిక్‌ని ఆదర్శంగా తీసుకొని అతడిలా బాడీ మెయింటేన్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అయితే సడెన్‌గా హృతిక్ చేతి కర్ర సాయంతో నడుస్తూ కనిపించారు. డైరెక్టర్ గోల్డీ బెహల్ పుట్టినరోజుకు హాజరైన హృతిక్ చేతి కర్రతో కలిపించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ‘హృతిక్‌కు ఏమైంది’ అంటూ ఆరా తీస్తుంటే.. మరికొందరు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక 2025 ‘వార్-2’ సినిమాతో హృతిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో జూ.ఎన్టిఆర్ కూడా నటించారు. ప్రస్తుతం హృతిక్ ‘క్రిష్-4’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం.