Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ రైల్లే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దయ్య అనే వ్యక్తి రైల్వే పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డోన్ రైల్వే స్టేషన్‌లో జిఆర్‌పి ఔట్ పోస్టు కార్యాలయంలో తుపాకీ సరెండర్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. వెంటనే పెద్దయ్య అక్కడే పడిపోయాడు. సహోద్యోగులు కానిస్టేబుల్‌ను లేపడానికి ప్రయత్నించారు. రక్తపు మడుగులో కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే, సివిల్, డోన్ డిఎస్‌పి శ్రీనివాసులు అక్కడి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు అక్కడి చేరుకొని కన్నీంటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.