Reading Time: < 1 minute

అండర్-19 వరల్డ్ కప్‌ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో కివీస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 22 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లో కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, టీమిండియా బౌలర్ల దెబ్బకు వరుస వికెట్లు కోల్పోయిన కివీస్ 36.2 ఓవర్లలో కేవలం 135 పరుగులకే పరిమితమైంది.

కివీస్ బ్యాటర్లలో కల్లమ్ సామ్సన్ 37 పరుగులు, సెల్విన్ సంజయ్ 28 పరుగులు, జాకబ్ కాటర్ 23 పరుగులు చేశారు. టాపార్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బౌలర్లలో ఆర్ అంబ్రిష్ నాలుగు వికెట్లు, హెనిల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా..ఖిలాన్ పేటల్, మొహమ్మద్ ఎనాన్, కనిష్క్ చౌహాన్ లు తలో వికెట్ తీశారు.