Reading Time: < 1 minute

మ్యాచో స్టార్ టి.గోపీచంద్… విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థా యిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో రాబోతున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్ర బృందం భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ ని షూటింగ్‌ను ప్రారంభించింది. రాత్రిపూట చిత్రీకరించే క్లైమాక్స్ కోసం ప్ర త్యేకంగా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. దీనిని 25 రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నా రు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ క్లైమాక్స్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందించనుంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది. గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు.