
జార్ఖండ్ లో నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం నాడు గోండా – అసన్సోల్ ఎక్స్ ప్రెస్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. కానీ, జసిదిహ్ -అసన్సోల్ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారి తెలిపారు. తూర్పు రైల్వే జోన్ పరిధిలోని అసన్సోల్ రైల్వే డివిజన్ లోని జాసిదిహ్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కు కాస్త దెబ్బతిన్నా, ఆ ప్రాంతంలో ఉన్న రెండు మోటర్ సైకిళ్లు మాత్రం దెబ్బతిన్నాయి.