
విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టి20లో భారత్ బ్యాటింగ్ ముగిసింది.భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పొయి 238 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి న బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద సంజూశాంసన్ (10) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఇషాన్ కిషన్(8) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు.అభిషేక్ శర్మ(84: 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్ లు) విధ్వంసం సృష్టించాడు. సూర్య కుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25), రింకు సింగ్ (44) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 2, కైల్ జేమీసన్ 2, శాంట్నర్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు.