
నాగ్‌పూర్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్‌ని విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. ఇక భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టన్ క్లార్క్ కివీస్ జట్టులో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇక భారత జట్టులో శ్రేయస్, హర్షిత్, బిష్ణోయ్, కుల్దీప్ ఈ మ్యాచ్‌కి దూరమయ్యారు.
తుది జట్లు:
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: టిమ్ రాబిన్‌సన్, డెవాన్ కాన్వాయ్(కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), క్రిస్టస్ క్లార్క్, కైల్ జెమిసన్, ఇష్ సోదీ, జెకబ్ డఫీ.